నాలుగు ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనంపై కేంద్రం పరిశీలన!
- జాబితాలో బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ బ్యాంకు, ఓబీసీ, సెంట్రల్ బ్యాంక్
- విలీనంతో మొండి బకాయిల పెరుగుదలకు బ్రేక్ పడుతుందన్న యోచన
- ఈ నాలుగు బ్యాంకులకు 2017-18లో రూ.21,646 కోట్ల నష్టాలు
విలీనం ద్వారా ఈ బ్యాంకుల్లో మొండి బకాయిల పెరుగుదలకు అడ్డుకట్ట పడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ భావిస్తోంది. విలీనం తర్వాత ఏర్పడే బ్యాంకు బలహీన ఆస్తులను విక్రయించడం, బ్రాంచ్ లను మూసివేయడం ద్వారా నష్టాలను తగ్గించుకునే చర్యలు తీసుకునే వీలుంటుంది. ఈ నాలుగు బ్యాంకుల ఉమ్మడి నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.21,646 కోట్లుగా ఉన్నాయి. మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖ ఐడీబీఐ బ్యాంకులో తనకున్న 51 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సరైన వ్యూహాత్మక భాగస్వామి లభిస్తే రూ.9,000-10,000 కోట్లకు విక్రయించాలని అనుకుంటున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం.