యూపీలో బీజేపీ ఓటమికి వేసవి సెలవులే కారణమట .. సెలవిచ్చిన అమాత్యుడు!
- బీజేపీ అభిమానులు సెలవులకు వెళ్లారు
- లేదంటే గెలిచే వాళ్లమే
- మంత్రి మాటలతో అవాక్కయిన నేతలు
ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమిపై మంత్రి లక్ష్మీనారాయణ చౌదరి మాట్లాడుతూ.. నిజానికీ ఎన్నికలను సాధారణ ఎన్నికలతో పోల్చకూడదని పేర్కొన్నారు. ప్రభుత్వ పనితీరుకు ఈ ఫలితాలు ఎంతమాత్రమూ గీటురాయి కావన్నారు. పిల్లాపాపలతో కలిసి తమ ఓటర్లు వేసవి సెలవులకు వెళ్లడంతోనే తాము ఓటమి పాలయ్యామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇలా జరగదని పేర్కొన్నారు. ఆయన సమాధానంతో ప్రతిపక్ష నేతలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా అవాక్కయ్యారు.