చంద్రబాబు చేతిలో నటుడు శివాజీ కీలుబొమ్మ: మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు
- గతంలో శివాజీ నోటి నుంచి 'ఆపరేషన్ గరుడ' వ్యాఖ్యలు
- అవి నిజమేననిపిస్తోందని చంద్రబాబు తాజా వ్యాఖ్యలు
- శివాజీతో చెప్పించింది చంద్రబాబేనంటున్న ఐవైఆర్
ఆపై ఇప్పుడు 'ఆపరేషన్ గరుడ' నిజం కావచ్చని చంద్రబాబు అంటున్నారని, చంద్రబాబు ఏం ఐడియా వేశారోనని అన్నారు. ఏ కారణాలతో 'ఆపరేషన్ గరుడ' నిజమవుతుందని చంద్రబాబు అంటున్నారో సమాధానం చెప్పాలని ఐవైఆర్ డిమాండ్ చేశారు. కాగా, దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలన్న ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం 'ఆపరేషన్ గరుడ' ప్రారంభించిందని, ఇందులో భాగంగా ఒక్కో రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నది మోదీ, అమిత్ షాల ప్లాన్ అని శివాజీ విమర్శించిన సంగతి తెలిసిందే.