సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • సమంత సినిమాలో గెస్టుగా కీర్తి!
  • హైదరాబాదులో 'టూ స్టేట్స్' రీమేక్ షూటింగ్  
  • ట్రైన్ లో షూటింగ్ చేస్తున్న హీరో రామ్  
*  ఇటీవల కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటించిన 'మహానటి' సినిమాలో సమంత గెస్ట్ రోల్ చేసిన విషయం తెలిసిందే. దీనికి బదులుగా అన్నట్టు, ఇప్పుడు సమంత హీరోయిన్ గా నటిస్తున్న 'సీమరాజా' చిత్రంలో కీర్తి సురేశ్ గెస్ట్ రోల్ చేస్తోంది. ఇందులో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్నాడు.
*  డాక్టర్ రాజశేఖర్ కూతురు శివాని కథానాయికగా పరిచయం అవుతున్న 'టూ స్టేట్స్' తెలుగు రీమేక్ తాజా షెడ్యూల్ ఈ నెల 7 నుంచి హైదరాబాదులో జరుగుతుంది. వెంకట్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అడవి శేష్ హీరోగా నటిస్తున్నాడు.
*  రామ్ హీరోగా నటిస్తున్న 'హలో గురు ప్రేమ కోసమే' చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. ప్రస్తుతం కొన్ని ట్రైన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ నాయికగా నటిస్తోంది.
Samantha
keerthi
Ram
Anupama

More Telugu News