విడిపోయిన పది రోజులకే ఒక సినిమాలో కలిసి నటించాం: రమాప్రభ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విడిపోయిన పది రోజులకే ఒక సినిమాలో కలిసి నటించాం: రమాప్రభ

  • నేనేం గిల్టీగా ఫీల్ కాను 
  • ఎందుకంటే నేనేం తప్పు చేయలేదు
  • అదొక జీవితం కాదు .. ఒక సీన్ అంతే
తెలుగు తెరపై అల్లు రామలింగయ్య .. రాజబాబులతో కలిసి రమాప్రభ చేసిన సందడి అంతా ఇంతా కాదు. అలా రమాప్రభ చేసిన పాత్రలు కొన్ని ప్రేక్షకుల హృదయాల్లో ఆమెకి సుస్థిరమైన స్థానాన్ని ఇచ్చాయి. అలాంటి రమాప్రభ తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన వైవాహిక జీవితాన్ని గురించి కూడా ప్రస్తావించారు.

"శరత్ బాబు .. నేను విడిపోయిన తరువాత చాలా చోట్ల ఎదురుపడిన సందర్భాలు వున్నాయి. నేను మాములుగానే వుంటాను .. కానీ ఆయనే మాట్లాడడు .. మూతిముడుచుకుని కూర్చుంటాడు .. అయ్యో పాపం అనిపిస్తుంది. ఆయన ఎదుట నా కెటువంటి గిల్టీ ఫీలింగ్ ఉండదు .. ఎందుకంటే ఆయనకి సంబంధించినవి నేనేం దొంగతనం చేయలేదు. మేం విడిపోయిన పది రోజులకే మధుసూదనరావు దర్శకత్వంలో కలిసి నటించాం .. కాకపోతే మేం విడిపోయిన సంగతి అప్పటికి ఆ దర్శకుడికి తెలియదు. అప్పటి జీవితాన్ని నేను ఒక సినిమాగా కూడా అనుకోను .. కాస్త ఎక్కువసేపు సాగిన సీన్ అనుకుంటాను అంతే" అంటూ చెప్పుకొచ్చారు.  
ramaprabha
sharath babu

More Telugu News