హుషారుగా స్టెప్పులేస్తూ ఆపరేషన్... కోరి కష్టాలు కొనితెచ్చుకున్న మహిళా డాక్టర్... వీడియో!
- డ్యాన్స్ చేస్తూ ఆపరేషన్ చేసిన అట్లాంటా వైద్యురాలు
- ఆపై వీడియో తీసి యూట్యూబ్ లో పోస్టు
- కఠిన చర్యలకు సిద్ధమైన వైద్య బోర్డు
అట్లాంటా ఏరియా బోర్టు నుంచి డెర్మటాలజిస్టుగా ధ్రువీకరణ పొందిన ఆమెపై కఠిన చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. గతంలో నాలుగుసార్లు ఆమె ఇలాగే డ్యాన్స్ చేస్తూ ఆపరేషన్లు చేశారని, ఆమెపై నాలుగు కేసులు విచారణ దశలో ఉన్నాయని అధికారులు అంటున్నారు. ఇక ఆమె శస్త్రచికిత్స సమయంలో పాటించాల్సిన కనీస నియమాలను పాటించలేదని అట్లాంటా హెల్త్ బోర్డు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆమె డ్యాన్స్ చేస్తున్న వీడియోను మీరు కూడా చూడొచ్చు.