మళ్లీ కెరియర్ పై దృష్టి పెట్టిన శ్రుతి హాసన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మళ్లీ కెరియర్ పై దృష్టి పెట్టిన శ్రుతి హాసన్

  • ప్రేమలో పడిన శ్రుతిహాసన్ 
  • విదేశాల్లో విహారాలు 
  • చేజారిన అవకాశాలు
తెలుగు .. తమిళ భాషల్లో అందాల కథానాయికగా శ్రుతి హాసన్ కి ఎంతో క్రేజ్ వుంది. తమిళ కుర్రాళ్ల మనసులు దోచేసిన శ్రుతికి, తెలుగులోను మంచి హిట్లు పడ్డాయి. అయినా ఆమె హిందీ సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అక్కడ మంచి గుర్తింపు వస్తుందనుకున్న సమయంలోనే ఆమె ప్రేమలో పడటం .. విదేశాల్లో షికార్లు చేయడం మొదలుపెట్టింది. అందుబాటులో లేని కారణంగా అవకాశాలు చేజారాయి.

 శ్రుతి వ్యవహారం చూసినవాళ్లంతా త్వరలోనే పెళ్లి వార్త చెబుతుందని అనుకున్నారు. ఆమెలో మునుపటి గ్లామర్ లేదని కూడా చెప్పుకున్నారు. కట్ చేస్తే శ్రుతి ఇప్పుడు తన గ్లామర్ పైన .. కెరియర్ పైన దృష్టిపెట్టింది. మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఇక నుంచి వరుస సినిమాలు చేయాలని బలంగా నిర్ణయించుకుందట. ఇంతలో ఇంత మార్పేమిటి చెప్మా? అని బాలీవుడ్ జనాలు ఆశ్చర్యపోతున్నారు.  
sruthi haasan

More Telugu News