ఒకే తరహా కథలను తీయడం నాకు నచ్చదు: కృష్ణవంశీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒకే తరహా కథలను తీయడం నాకు నచ్చదు: కృష్ణవంశీ

  • ప్రేక్షకులకు కనెక్ట్ అయితే ఆ మూవీ హిట్ 
  • ప్లాప్ సినిమాలు చుక్కలు చూపిస్తాయి 
  • నా సినిమాలు కొత్తగా ఉండాలనే చూస్తాను
కృష్ణవంశీ ఎంచుకునే కథలు .. వాటిని తెరపై ఆయన ఆవిష్కరించే తీరు అద్భుతంగా ఉంటుంది. ఈ కారణంగానే కృష్ణవంశీని క్రియేటివ్ డైరెక్టర్ అని పిలుస్తుంటారు. ఆయన నుంచి వచ్చే సినిమాల కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. అలాంటి కృష్ణవంశీకి కొంతకాలంగా చెప్పుకోదగిన హిట్ పడలేదు.

ఈ నేపథ్యంలో 'మాకు మళ్లీ మునుపటి కృష్ణవంశీని చూడాలని వుంది సార్ .. ఒక హిట్ సినిమా తీయండి' అంటూ ఒక అభిమాని ట్విట్టర్ ద్వారా ఆయనని అడిగాడు. అందుకు కృష్ణవంశీ స్పందిస్తూ .. 'హిట్ సినిమాలు .. ప్లాప్ సినిమాలు అని రెండు రకాలుగా తెరకెక్కవు. ప్రేక్షకులకు కనెక్ట్ అయితే హిట్ అవుతాయి .. లేదంటే చుక్కలు చూపిస్తాయి' అన్నారు.

 'ఖడ్గం' లాంటి సినిమాను ఆయన నుంచి ఆశిస్తున్నట్టుగా మరో అభిమాని ట్వీట్ చేశాడు. 'ఒకేలాంటి సినిమాలు చేయడం నాకు ఇష్టం ఉండదు .. ఎప్పటికప్పుడు కొత్తగా ఉండాలనే ఆలోచిస్తాను' అంటూ కృష్ణవంశీ సమాధానమిచ్చారు.  
krishnavamsi

More Telugu News