పూరి జగన్నాథ్ ప్రతి నెల నాకు కొంత డబ్బు పంపిస్తున్నారు!: సీనియర్ హాస్యనటి రమాప్రభ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పూరి జగన్నాథ్ ప్రతి నెల నాకు కొంత డబ్బు పంపిస్తున్నారు!: సీనియర్ హాస్యనటి రమాప్రభ

  • హైదరాబాద్ లో నాకంటూ ఏమీలేదు 
  • అక్కడే కాదు ఎక్కడా ఏమీ లేదు
  • ఆస్తులు ఇలా వచ్చాయి .. అలా పోయాయి        
తెలుగు తెరపై హాస్యాన్ని పండించినవారిలో రమాప్రభ స్థానం ప్రత్యేకం. ఎంతోమంది అగ్రస్థాయి నటీనటులతో కలిసి ఆమె నటించారు .. ఎన్నో విభిన్నమైన పాత్రలతో మెప్పించారు. అలాంటి రమాప్రభ ప్రస్తుతం చిత్తూరు జిల్లా 'మదనపల్లి'లో ఉంటున్నారు. తాజాగా ఆమె ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

"ఇప్పుడు హైదరాబాద్ లో కాదు గదా నా పేరుతో నా కంటూ ఎక్కడా ఏమీ లేదు. ఆస్తులు అలా వచ్చాయి .. ఇలా పోయాయి .. అదంతే. కొంతమంది గుప్తదానం చేస్తుంటారు .. కొంతమంది స్టేజ్ మీద ఇస్తుంటారు. ఏ రుణమో తెలియదుగానీ, పూరి జగన్నాథ్ నాకు ప్రతి నెల కొంత డబ్బు పంపిస్తున్నాడు. పూరితో ఎక్కువ సినిమాలు చేయకపోయినా .. ఎక్కువ బంధం లేకపోయినా ఆయన సాయం చేస్తున్నాడు. ఇది పూర్వజన్మ బంధమనీ .. రుణాను బంధమని నేను అనుకుంటూ వుంటాను" అంటూ చెప్పుకొచ్చారు.       
ramaprabha

More Telugu News