'కింభో' యాప్‌లో లోపాలు.. మళ్లీ టెస్ట్ చేస్తున్న పతంజలి!

  • ఇటీవలే విడుదల
  • యాప్‌లో సాంకేతికపరమైన లోపాలు 
  • ఇప్పటికే 1.5 లక్షల మంది డౌన్‌లోడ్
ఇటీవల యోగా గురు రామ్‌దేవ్‌ బాబా ‘కింభో’ పేరుతో వాట్సప్‌ తరహా యాప్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, అది మర్నాడే గూగుల్‌ ప్లే స్టోర్‌లో కనపడకుండా పోయినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై పతంజలి అధికార ప్రతినిధి ఎస్‌కే తిజరావాలా తాజాగా స్పందిస్తూ, ప్రస్తుతం ఆ యాప్‌ అందుబాటులో లేదని అన్నారు.

ఈ యాప్‌లో సాంకేతికపరమైన లోపాలు ఉన్నట్లు తెలిసిందని, అందుకే తాము వెనక్కు తీసుకుని టెస్ట్ రన్ చేస్తున్నామని, తిరిగి త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. ‘కింభో’ యాప్‌ను ఇప్పటికే 1.5 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని అన్నారు. కాగా, తమ యాప్ ప్రస్తుతం కనిపించదని, తమ పేరుతో వచ్చే ఇతర యాప్‌లకు తాము బాధ్యత వహించమని తేల్చి చెప్పారు.
Go Back to Shorts
patanjali
app
ramdev baba

More Telugu News