Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా పాలనలో అవినీతి పెరిగిపోయింది!: యూపీ అధికార బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

  • ఎమ్మెల్యే శ్యామ్‌ ప్రకాశ్‌ సంచలన వ్యాఖ్యలు
  • అన్ని శాఖల్లోనూ అవినీతి
  • ప్రభుత్వం గాడి తప్పింది
  • విఫలమైం‍ది
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి నియోజక వర్గ బీజేపీ ఎమ్మెల్యే శ్యామ్‌ ప్రకాశ్‌ తమ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో అవినీతి అధికంగా ఉందంటూ, అధికారులంతా అవినీతికి పాల్పడుతున్నారంటూ పేర్కొని అలజడి రేపారు. తమ ప్రభుత్వం పట్ల రైతులు వ‍్యతిరేకతతో ఉన్నారని, ఇలాంటి పలు కారణాల వల్లే తాము ఇటీవల జరిగిన కైరానా లోక్‌సభ ఉప ఎన్నికలో ఓడిపోయామని అన్నారు. అంతేగాక, గత రాష్ట్ర సర్కారుతో పోల్చి చూస్తే ప్రస్తుతం అన్ని శాఖల్లో అవినీతి పెరిగిపోయిందన్నారు.
 
మరోవైపు, తన ఫేస్‌బుక్‌ పేజీలో తమ పార్టీపై విమర్శిస్తూ ఒక పద్యం సైతం పోస్ట్‌ చేశారు. ప్రధాని మోదీ వల్లే సీఎం ఆదిత్యనాథ్‌ అధికారం దక్కించుకోగలిగారని, అధికార పగ్గాలు సంఘ్‌ చేతిలో ఉన్నాయని, అందుకే ముఖ్యమంత్రి అయినప్పటికీ యోగి ఏమీ చేయలేకపోతున్నారని అన్నారు. ప్రభుత్వం గాడి తప్పిందని, విఫలమైం‍దని అన్నారు.
bjp
Uttar Pradesh

More Telugu News