మెగాస్టార్ తాజా నిర్ణయం .. 'సైరా'తో పాటే కొరటాల మూవీ?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెగాస్టార్ తాజా నిర్ణయం .. 'సైరా'తో పాటే కొరటాల మూవీ?

  • సురేందర్రెడ్డి దర్శకత్వంలో 'సైరా'
  • తాజా షెడ్యూల్ కి సన్నాహాలు 
  • కొరటాలను రంగంలోకి దింపుతోన్న చిరూ  
ప్రస్తుతం చిరంజీవి .. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా తాజా షెడ్యూల్ ను మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాతో పాటు కొరటాల సినిమాను కూడా చేయాలనే నిర్ణయానికి చిరంజీవి వచ్చినట్టుగా తాజా సమాచారం.'సైరా' కథా వస్తువు విస్తారమైనది .. చారిత్రక నేపథ్యంతో కూడినది. ఆలస్యంగా సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా ఇంతవరకూ 30 శాతం చిత్రీకరణను మాత్రమే జరుపుకుంది. షూటింగు పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా సమయం పడుతుంది. అభిమానులకి .. తనకి మధ్య అంత గ్యాప్ రాకూడదని భావించిన చిరంజీవి, కొరటాల సినిమాను కూడా సాధ్యమైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారట. 'సైరా' మూవీకి సంబంధించి గెటప్ ల విషయంలో సమస్య తలెత్తకుండా షెడ్యూల్స్ ప్లాన్ చేయాలని ఆల్రెడీ కొరటాలకి చెప్పారనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిస్తోంది.  
chiranjeevi
koratala

More Telugu News