ఢిల్లీలో హెచ్సీఎల్ టెక్కీ కిడ్నాప్... రెస్క్యూ ఆపరేషన్ చేసి విడిపించిన పోలీసులు!
- మే 23న కిడ్నాప్ అయిన రాజీవ్
- ఆచూకీ తెలుసుకునేందుకు వారం రోజుల శ్రమ
- ఎన్ కౌంటర్ లో ఇద్దరు పోలీసులకు, కిడ్నాపర్లకు గాయాలు
విషయం పోలీసులకు చేరడంతో రాజీవ్ ను ఎక్కడ దాచుంచారన్న విషయాన్ని కనుక్కునేందుకు వారం రోజుల పాటు శ్రమించారు. ఢిల్లీకి సమీపంలోని ఇందిరాపురంలో అతన్ని దాచుంచారని గుర్తించి, స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ను పంపారు. ఈ ఉదయం రాజీవ్ ను దాచి ఉంచిన చోటుకు చేరుకున్న పోలీసులకు, కిడ్నాపర్లకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఇద్దరు కానిస్టేబుళ్లకు, ఇద్దరు కిడ్నాపర్లకు గాయాలు అయ్యాయి. వారి బారి నుంచి రాజీవ్ ను రక్షించిన పోలీసులు, ఇదే గ్రూప్ గతంలోనూ యువకులను కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేసిందని పోలీసు అధికారులు వెల్లడించారు.