30 ఏళ్ల నాటి పాటకు డ్యాన్స్ అదరగొట్టిన అంకుల్... ఎక్కడ చూసినా ఈ వీడియోనే!
- వైరల్ అవుతున్న అంకుల్ డ్యాన్స్
- 'ఖుద్ గర్జ్'లోని 'ఆప్ కే ఆజానే సే' అనే పాటకు స్టెప్పులు
- సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ షేర్ చేస్తున్న వీడియో
దాదాపు 40 ఏళ్లకు పైగా వయసున్న ఓ వ్యక్తి, 1987లో జితేంద్ర, గోవింద, శతృఘ్నసిన్హా కాంబినేషన్ లో వచ్చిన మల్టీ స్టారర్ 'ఖుద్ గర్జ్'లోని 'ఆప్ కే ఆజానే సే' అనే పాటకు అదిరిపోయే స్టెప్పులేశాడు. పక్కన ఉన్న ఓ ఆంటీ ఆయన్ను అనుసరించలేక అలా చూస్తుండిపోయింది. పలువురు సెలబ్రిటీల నుంచి ఎంతో మంది సామాన్యుల వరకూ షేర్ చేసుకుంటున్న ఈ వీడియోలో డ్యాన్స్ చేస్తున్నది ఎవరు? ఎక్కడ తీశారు? ఎప్పుడు తీశారు? అన్న విషయాలు తెలియకపోయినా, ఇది తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ ఓమారు చూడండి.