నిర్మాత పరారీకి సహకరించిన కన్నడ హీరోపై కేసు!
- 'మస్తిగుడి' కన్నడ చిత్రం షూటింగ్ వేళ ప్రమాదంలో ఇద్దరు మృతి
- నిర్మాతను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వస్తే అడ్డుకున్న హీరో దునియా విజయ్
- హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసు నమోదు
తావరకెరె హెడ్ కానిస్టేబుల్ గోవిందరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు రిజిస్టర్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఇద్దరు ఆర్టిస్టులూ మరణించిన తరువాత, నిర్మాత సుందరగౌడను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లిన వేళ, అక్కడికి వచ్చిన విజయ్, పోలీసులను అడ్డుకుని వారితో మాట్లాడుతుండగా, సుందరగౌడ తప్పించుకున్నాడు. విజయ్ పరోక్షంగా సహకరించినందునే ఆయన తప్పించుకున్నాడని హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో, పోలీసుల విధులను అడ్డుకున్నారన్న సెక్షన్ కింద కేసు నమోదైంది.