Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎట్టకేలకు ప్రభుత్వ బంగళాను ఖాళీ చేసిన అఖిలేశ్ యాదవ్!

  • మరో రెండేళ్లు అదే బంగళాలో ఉంటామన్న అఖిలేశ్‌
  • కుదరదన్న సుప్రీంకోర్టు 
  • తండ్రితో కలిసి వేరే ఇంటికి వెళ్లిన యూపీ మాజీ సీఎం
ఇప్పటికీ ప్రభుత్వ బంగళాలోనే ఉంటోన్న ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ ఈరోజు ఆ నివాసాన్ని ఖాళీ చేశారు. పలు కారణాలు చూపుతూ మరో రెండేళ్లు తాము అదే బంగళాలో ఉంటామని, అందుకు అవకాశం ఇవ్వాలని  అఖిలేశ్ యాదవ్ సుప్రీంకోర్టుకు విన్నవించుకున్న విషయం తెలిసిందే.

అయితే, ఈ విషయంపై సర్వోన్నత న్యాయస్థానం 15 రోజుల్లోగా ఆ బంగళాను ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించడంతో చేసేదేమీ లేక ఖాళీ చేశారు. మరోవైపు బహుజన్ సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ) అధినేత్రి మాయావతి కూడా నిన్న ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేసి, నూతన భవనానికి వెళ్లారు.                                                                                          
akhilesh
mulayam
Uttar Pradesh

More Telugu News