మేకప్ కోసమని వచ్చి బంగారంతో ఉడాయిస్తుంది... పట్టిస్తే పాతిక వేల బహుమతి అంటున్న కేపీహెచ్బీ పోలీసులు!

  • బ్యూటీ పార్లర్లలో మాయలేడి మోసాలు
  • సీసీటీవీ చిత్రాన్ని విడుదల చేసిన పోలీసులు
  • పట్టుకోవడంలో ప్రజల సహకారం కావాలని విజ్ఞప్తి
మేకప్ వేయించుకునేందుకు వచ్చానని చెబుతూ, బ్యూటీ పార్లర్లకు వెళ్లి, అక్కడున్న వారిని మోసం చేసి, చోరీలు చేస్తున్న ఓ మహిళ ఫొటోను విడుదల చేసిన హైదరాబాద్ శివారు కేపీహెచ్బీ పోలీసులు, ఆమె ఆచూకీ తెలిపితే రూ. 25 వేలు బహుమతిగా ఇస్తామని చెబుతున్నారు.

కూకట్ పల్లి ఏసీపీ భుజంగరావు వెల్లడించిన వివరాల ప్రకారం, కేపీహెచ్బీ పరిధిలో రెండు వేర్వేరు బ్యూటీ పార్లర్లలో బంగారం దొంగతనం జరిగినట్టు ఫిర్యాదులు అందాయి. ఇక్కడి సీసీ కెమెరాలను పరిశీలించిన తరువాత రెండు కేసుల్లోనూ నిందితురాలు ఒకరేనని తేల్చారు. కేపీహెచ్బీ కాలనీ 6వ ఫేజ్, నిజాంపేటల్లో ఉన్న బ్యూటీ పార్లర్లకు వెళ్లి, అక్కడి యజమానిని మాటల్లో పెట్టి, మత్తు మందు కలిపిన బిళ్లలు ఇచ్చి ఆపై బంగారంతో ఉడాయించిందని అధికారులు తెలిపారు. ఈ మాయలేడితో జాగ్రత్తగా ఉండాలని, ఈమెను పట్టుకునేందుకు ప్రజల సహకారం కావాలని భుజంగరావు కోరారు.
Go Back to Shorts
Hyderabad
Police
Kukatpalli
Beauty Parlour
Theft

More Telugu News