రైలు మీద సెల్ఫీ కోసం ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి.. కృష్ణా జిల్లాలో విషాదం!
- గూడ్స్ రైలుపై సెల్ఫీకి ప్రయత్నించిన విద్యార్థి
- హైటెన్షన్ వైర్లు తాకి కుప్పకూలిన వైనం
- మూడు ఆసుపత్రులకు తరలించినా దక్కని ప్రాణం
70 శాతం గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న రామసాయిని వెంటనే జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి గొల్లపూడి ఆంధ్రా ఆసుపత్రికి, అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో విద్యార్థి మృతి చెందాడు.