ప్రణబ్ ఏం మాట్లాడతారబ్బా? ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్!
- జూన్ 7న ఆరెస్సెస్ స్నాతకోత్సవం
- ప్రత్యేక అతిథిగా ప్రణబ్
- ఆయన ఎక్కడైనా మాట్లాడుకోవచ్చన్న అభిషేక్ సింఘ్వీ
మరో అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. రాష్ట్రపతి పదవితో ఆయన రాజకీయాలను వదిలిపెట్టారని, ఆయన ఎక్కడైనా మాట్లాడుకోవచ్చని తేల్చి చెప్పారు. ఆయన ఏం మాట్లాడారు, తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏం చేశారు? అన్నదానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మరో కాంగ్రెస్ నేత సీకే జాఫర్ ఏకంగా ప్రణబ్‌కే లేఖ రాశారు. ఆయన నిర్ణయం తనను షాక్‌కు గురిచేసిందని వ్యాఖ్యానించారు.