Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జూన్ 10.. 100 రోజులు.. 16 మంది సెలబ్రిటీలు.. 1 బిగ్ హౌస్: నాని ప్రకటన

  • ఈల వేస్తూ వచ్చేస్తోన్న నాని
  • టీవీలో బిగ్‌ బాస్‌ ప్రసార ప్రారంభ ముహూర్తం ప్రకటన
  • 'ఏదైనా జరగొచ్చు' రెడీగా ఉండండంటోన్న నేచురల్ స్టార్
స్టార్ మా టీవీలో తెలుగు 'బిగ్‌బాస్' సీజన్ 2 ప్రసారానికి ముహూర్తం కుదిరింది. నేచురల్ స్టార్ నాని ఈల వేస్తూ వచ్చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్‌ కూడా విడుదలైంది. 'జూన్ 10.. 100 రోజులు.. 16 మంది సెలబ్రిటీలు.. 1 బిగ్ హౌస్.. బిగ్ బాస్ 2' అంటూ నాని ట్వీట్ చేశాడు.

వచ్చేనెల 10 నుంచి తాను బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులను అలరించబోతున్నానని నాని చెప్పాడు. 'ఏదైనా జరగొచ్చు' రెడీగా ఉండండంటూ నాని మరింత ఆసక్తి పెంచుతున్నాడు. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు, ప్రతి సోమ, శుక్ర వారాల్లో రాత్రి 9.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. బిగ్‌బాస్‌ సీజన్ 2లో నాని హోస్ట్ గా వ్యవహరిస్తాడని ఇటీవలే అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన టీజర్ ను కూడా ఇప్పటికే విడుదల చేశారు. 
nani
bigboss
maa tv

More Telugu News