Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకున్న అలవాటునే 'పెళ్లి' సినిమాలో పెట్టారు!: నటుడు పృథ్వీరాజ్

  • పెళ్లి' సినిమాను గురించి ప్రస్తావించిన పృథ్వీరాజ్ 
  • నా చేతికి వున్న ఖరీదైన వాచ్ ని ఇచ్చేశాను
  • ఆ సంగతి కోడి రామకృష్ణగారికి తెలిసింది
తెలుగు .. తమిళ భాషల్లో నటుడు పృథ్వీరాజ్ కి మంచి గుర్తింపు వుంది. కొన్ని కారణాల వలన కొంతకాలం పాటు సినిమాలకి దూరమైన ఆయన, రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. "నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ వుంది. ఎవరైనా నా దగ్గరున్న ఒక వస్తువు బాగుందంటే, వెంటనే దానిని వాళ్లకి ఇచ్చేస్తూ వుంటాను.

'పెళ్లి' సినిమా సమయంలో ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు. నా చేతికి వున్న వాచ్ ఆయనకి బాగా నచ్చింది. 'మీ వాచ్ చాలా బాగుంది సార్' అని ఆయన నాతో రెండు సార్లు అన్నాడు. 'అయితే తీసుకో' అని, ఆ వాచ్ ను ఆయనకి ఇచ్చేశాను. అసిస్టెంట్ డైరెక్టర్ చేతికి నా వాచ్ ను చూసిన కోడి రామకృష్ణ గారు ఆయనని అడిగారట. తాను బాగుందని అనగానే పృథ్వీరాజ్ గారు ఇచ్చేశారని అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాడు. అంతే, కోడి రామకృష్ణ గారు అలాంటి సీన్ ఒకటి 'పెళ్లి' సినిమాలో పెట్టేశారు. ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తూ .. వాళ్లు వాల్ క్లాక్ బాగుందిరా అంటే .. తీసుకో అంటాను. ఫోన్ చాలా బాగుందిరా అంటే .. తీసుకో అంటాను. నా భార్యను చూసి తాను చాలా బాగుంది అంటే .. తీసుకో అంటాను. ఈ సీన్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది" అని చెప్పుకొచ్చారు.    
prithvi raj

More Telugu News