వెనక్కు తగ్గేది లేదు... రాజీనామాలు ఆమోదింపజేసుకుంటాం!: వైసీపీ ఎంపీలు
- రాజీనామాలపై వివరణ ఇచ్చేందుకు ఢిల్లీకి వెళ్లిన వైసీపీ ఎంపీలు
- ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం
- మీడియాతో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
తమ రాజీనామాలను ఆమోదింపజేసుకునే తిరిగి రాష్ట్రానికి వస్తామని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికలు వస్తే, ప్రజా క్షేత్రంలోనే తేల్చుకోవాలని తాము నిర్ణయించుకున్నామని, బై ఎలక్షన్స్ కు తాము సిద్ధమేనని ఆయన అన్నారు. తామిచ్చిన రాజీనామా లేఖలను వెంటనే ఆమోదించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ ను డిమాండ్ చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
5 కోట్ల ఆంధ్రుల మనోభావాలను బీజేపీ దెబ్బ తీసిందని, రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. 13 సార్లు తాము అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చామని గుర్తు చేసిన ఆయన, వాటిపై చర్చ జరగకుండా బీజేపీ నాటకాలు ఆడిందని విమర్శలు గుప్పించారు.