లాంచింగ్ కు ముందే వివో ఎక్స్21 బుకింగ్ లు ఆరంభం... పలు ఆకర్షణీయ ఆఫర్లు
- ఈ నెల 29న దేశీయ మార్కెట్లోకి విడుదల
- ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే విక్రయం
- రూ.2,000తో ప్రీ బుకింగ్
ఇలా ప్రీబుకింగ్ చేసుకున్న వారికి కంపెనీ 5 శాతం క్యాష్ బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ, రూ.1,000 విలువకు సరిపడా ఫెర్న్స్ అండ్ పెటల్స్ గిఫ్ట్ ఓచర్ తదితర ఆఫర్లను అందిస్తోంది. అయితే ధర ఎంతన్నది ఇంకా ప్రకటించలేదు. కాకపోతే ఈ ఏడాది మార్చికి ముందే వివో ఎక్స్21 చైనా మార్కెట్లో విడుదల అయింది. చైనాలో దీని ధర 3,598 యువాన్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.37,100.
స్పెసిఫికేషన్లు
6.28 అంగుళాల సూపర్ అమోలెడ్ ఫుల్ హెచ్ హెచ్ డీ డిస్ ప్లే, 19:9 యాస్పెక్ట్ రేషియో(ఫుల్ స్క్రీన్), 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, క్వాల్ కామ్ 660 ప్రాసెసర్, వెనుక 12+5 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరా, ముందు భాగంలో 12 మెగా పిక్సల్ కెమెరా ఉన్నాయి.