Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాట విననందుకు ప్రసీద్ కృష్ణను బూతులు తిట్టిన దినేశ్ కార్తీక్

  • సహనం కోల్పోయిన కార్తీక్
  • తన మాటలు పట్టించుకోని ప్రసీద్‌పై చిందులు
  • వైరల్ అవుతున్న వీడియో
సాధారణంగా కూల్‌గా కనిపించే కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ మొన్నటి మ్యాచ్‌లో సహనం కోల్పోయాడు. మాట వినకుండా బంతి విసిరిన ఫాస్ట్ బౌలర్ ప్రసీద్ కృష్ణను బూతులు తిట్టాడు. క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్-సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రసీద్ వేసిన తొమ్మిదో ఓవర్ చివరి బంతిని షకీబల్ హసన్ ఆఫ్ సైడ్ ఆడి సింగిల్ తీశాడు. ఆ బంతిని అందుకున్న ప్రసీద్ నాన్-స్ట్రైకింగ్ ఎండ్‌ వైపు విసిరాడు. అయితే స్టంప్స్ వెనక ఉన్న దినేశ్ కార్తీక్ బంతిని విసరొద్దని ప్రసీద్‌కు సూచించాడు. కెప్టెన్ మాటలు పట్టించుకోని ప్రసీద్ ఆ బంతిని నాన్-స్ట్రయికింగ్ ఎండ్‌వైపు విసిరాడు. అయితే, అది ఓవర్ త్రో కావడంతో బ్యాట్స్‌మెన్ మరో పరుగు తీశారు. ఇది చూసిన కార్తీక్‌కు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే ప్రసీద్‌ను బూతులు తిట్టేశాడు. స్టంప్స్ వద్ద ఉన్న కెమెరాల్లో కార్తీక్ మాటలు రికార్డు కావడంతో వైరల్ అయింది.
Dinesh Karthik
Prasidh Krishna
IPL
KKR

More Telugu News