అప్పట్లో తప్పు చేశానంటూ సన్నీ లియోన్ భావోద్వేగపూరిత ట్వీట్!
- తన జీవితం ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ చూసిన సన్నీ
- కన్నీరు ఆగలేదని ట్వీట్
- తన హృదయం కొన్ని వేలసార్లు బద్దలైందని వ్యాఖ్య
ఈ సందర్భంగా సన్నీలియోన్ ట్వీట్ చేస్తూ... ఆ డాక్యుమెంటరీ చూస్తున్నంత సేపు కన్నీరు ఆగలేదని, తన హృదయం కొన్ని వేలసార్లు బద్దలైందని పేర్కొంది. తాను నీలి చిత్రాల్లో నటించడానికి ముందు ఎలా ఉండేదాన్నో, మళ్లీ అలా కావాలని కోరుకుంటున్నానని తెలిపింది. కానీ ఆ రోజు ఎప్పటికీ రాదని, తన పాత వ్యక్తిత్వం మాత్రం ఎప్పటికీ గుర్తుంటుందని, తాను తప్పు చేశానని పేర్కొంది. ఆమె చేసిన ఈ ట్వీట్ అభిమానుల హృదయాలను తాకింది.