మా లవ్ అఫైర్ బ్రేకప్ కావడానికి కారణం సినిమాలే!: నికిషా పటేల్
- సినిమాల్లోకి రాకముందు ఒక వ్యక్తిని ప్రేమించా.. పెళ్లి చేసుకోవాలనుకున్నాం
- నేను సినిమాల్లోకి రావడం అతనికి ఇష్టం లేదు
- ఇప్పుడు ప్రేమ, పెళ్లి ఆలోచనలు లేవు
అన్నీ తెలిసే తాను అతన్ని వదులుకున్నానని నికిషా తెలిపింది. సినిమాల్లో కూడా తాను పూర్తిగా సక్సెస్ కాలేకపోయానని... అయినా, తాను బాధ పడటం లేదని చెప్పింది. ఒక్క సినిమా హిట్ అయినా... తాను బిజీ అవుతాననే నమ్మకం తనకు ఉందని తెలిపింది. గతంలో ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించేదాన్నని... ఇప్పుడు అలాంటి ఆలోచనలు రావడం లేదని స్పష్టం చేసింది. పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనిపిస్తే, అప్పుడు తప్పకుండా చేసుకుంటానని తెలిపింది.