కాసేపట్లో నిరాహార దీక్షకు దిగనున్న పవన్‌ కల్యాణ్‌
Add ap7am to your home Screen

కాసేపట్లో నిరాహార దీక్షకు దిగనున్న పవన్‌ కల్యాణ్‌

  • ఉద్ధానం కిడ్నీ బాధితులను ఆదుకోవాలని డిమాండ్‌
  • ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆగ్రహం
  • సాయంత్రం 5 నుంచి రేపు సాయంత్రం 5 గంటల వరకు దీక్ష
రెండు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉద్ధానం కిడ్నీ బాధితులతో సమావేశమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే. 48 గంటల్లో ప్రభుత్వం కిడ్నీ బాధితుల్ని ఆదుకోకపోతే నిరాహారదీక్షకు దిగుతానని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తన డిమాండ్‌పై పట్టించుకోకపోవడంతో ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు శ్రీకాకుళంలో తాను బస చేస్తోన్న రిసార్టులోనే పవన్‌ నిరాహార దీక్ష చేస్తారని, రేపు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రీకాకుళం పట్టణంలో ప్రజల మధ్యే పవన్‌ నిరాహార దీక్ష ఉంటుందని జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్‌ రెడ్డి పేరిట ప్రకటన విడుదలైంది. నిజానికి పవన్‌ కల్యాణ్‌ నిన్నటి నుంచి ఘనాహారాన్ని తీసుకోవడం మానేశారని అందులో పేర్కొన్నారు.                                                                                                                      
Pawan Kalyan
Jana Sena
Srikakulam District

More Telugu News