ఒకేసారి ఇద్దరమ్మాయిలను పెళ్లాడనున్న ఫుట్ బాల్ స్టార్ రొనాల్డినో

  • కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న రొనాల్డినో 
  • డిసెంబర్ నుంచి ఇద్దరితో సహజీవనం
  • ఆగస్టులో వివాహమని ప్రకటన
బ్రెజిల్ ఫుట్ బాల్ స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న రొనాల్డినో, మరోసారి వార్తల్లో నిలిచాడు. తాను సహజీవనం చేస్తున్న ఇద్దరు యువతులనూ ఒకేసారి వివాహం చేసుకోనున్నట్టు ప్రకటించాడు. ఆగస్టులో తాను ఒకేసారి ప్రిసిల్లా కోయిల్హో, బీట్రెజ్ సౌజాలను పెళ్లాడతానని చెప్పాడు.

వీరిద్దరూ రొనాల్డినోతో కలసి రియో డీజనీరోలో ఉన్న ఓ మాన్షన్ లో గత సంవత్సరం డిసెంబర్ నుంచి ఉంటున్నారని, అమ్మాయిలిద్దరి మధ్యా ఎటువంటి గొడవలూ లేవని బ్రెజిల్ వార్తా సంస్థలు తెలిపాయి. రొనాల్డినో సైతం వీరిద్దరినీ ఒకేలా చూస్తున్నారని, ఇటీవలి తన విదేశీ పర్యటన తరువాత ఇద్దరికీ ఒకే రకమైన పర్ఫ్యూమ్ తెచ్చిచ్చాడని తెలుస్తోంది. ఇక వీరి ముగ్గురి పెళ్లికి పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు రానున్నారట. రియోలోని శాంటా మొనికా కండోమినియంలో పెళ్లి జరుగుతుందని తెలుస్తోంది.
Go Back to Shorts
Ronaldinho
Marriage
Football

More Telugu News