నేటి ఐపీఎల్ మ్యాచ్ ఫిక్స్?... ఓడిపోనున్న హైదరాబాద్ సన్ రైజర్స్?: సంచలనం రేపుతున్న హాట్ స్టార్ ప్రోమో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేటి ఐపీఎల్ మ్యాచ్ ఫిక్స్?... ఓడిపోనున్న హైదరాబాద్ సన్ రైజర్స్?: సంచలనం రేపుతున్న హాట్ స్టార్ ప్రోమో

  • ఫైనల్స్ లో ఆడేది కోల్ కతా నైట్ రైడర్స్
  • ఫైనల్స్ ప్రోమో చూపిస్తున్న హాట్ స్టార్
  • మండిపడుతున్న సన్ రైజర్స్ అభిమానులు
నేడు హైదరాబాద్ సన్ రైజర్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరగనున్న ఐపీఎల్ ఎలిమినేటర్-2 మ్యాచ్ ఫిక్సయిందా? ఈ పోరులో హైదరాబాద్ సన్ రైజర్స్ ఓటమి చెంది, ఫైనల్స్ కు కోల్ కతా నైట్ రైడర్స్ వెళుతుందా? క్రికెట్ అభిమానులు సంధిస్తున్న ప్రశ్నలివి. ఐపీఎల్ పోటీలను లైవ్ టెలికాస్ట్ విధానంలో స్ట్రీమింగ్ చేస్తున్న హాట్ స్టార్, ఫైనల్ మ్యాచ్ గురించి చూపిస్తున్న ప్రోమోను చూస్తుంటే ఫిక్సింగ్ నిజమేనా అనిపిస్తోంది.

ఎందుకంటే, ఈ ఫైనల్ మ్యాచ్ కోల్ కతా, చెన్నై మధ్య జరగనుందని, ఉత్కంఠ భరితమైన ఈ మ్యాచ్ ని తప్పకుండా చూడాలన్నదే ఆ ప్రోమో సారాంశం. ఇక నిన్నటి నుంచి ఈ ప్రోమో వైరల్ అవుతుండగా, క్రీడాభిమానులు, ముఖ్యంగా హైదరాబాద్ సన్ రైజర్స్ ఫ్యాన్స్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఫైనల్స్ కు కోల్ కతా వెళుతుందని హాట్ స్టార్ ముందే ఎలా చెబుతుందని ప్రశ్నిస్తున్నారు.
IPL
Cricket
Final
Hyderabad
Kolkata
Chennai

More Telugu News