తమిళనాడు అసెంబ్లీ వద్ద స్టాలిన్ అరెస్ట్.. రేపు తమిళనాడు బంద్ కు డీఎంకే పిలుపు
- తూత్తుకుడి కాల్పులకు నిరసనగా అసెంబ్లీ వద్ద డీఎంకే మెరుపు ధర్నా
- భారీ ఎత్తున తరలి వచ్చిన డీఎంకే శ్రేణులు
- ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్
ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ, అమాయకుల ప్రాణాలను తీసిన వారిపై ఇంతవరకు ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక అసమర్థ ముఖ్యమంత్రి పాలన కొనసాగుతోందని విమర్శించారు. కనీసం ఘటనా స్థలానికి వెళ్లి, బాధితులతో మాట్లాడాలన్న ఆలోచన కూడా ఆయనకు లేదని అన్నారు. ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని, డీజీపీ కూడా బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు, రేపు తమిళనాడు బంద్ కు డీఎంకే పిలుపునిచ్చింది.