వివాదంలో వైసీపీ నేత జోగి రమేష్: కొత్త ప్రేమజంటకు బెదిరింపులు?
- కులాంతర వివాహం చేసుకున్న జంటకు బెదిరింపులు
- ఆపై ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు
- కేసు నమోదు చేసిన పోలీసులు
మరుసటి రోజు ఉదయం జడ రాంబాబు, బంక నాగరాజు, బాబూరావు, ముత్తి మల్లేశ్వరరావు తదితరులు, బుజ్జి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి, వారిపై దౌర్జన్యం చేసి, ఆ కొత్త జంటను వైసీపీ నేత జోగి రమేష్ నివాసానికి బలవంతంగా తీసుకువచ్చారు. అక్కడ వారిని నిర్బంధించి, బెదిరింపులకు దిగారు. ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు తీసుకున్నారు. ఈ ఘటనపై కొత్త జంట పోలీసులను ఆశ్రయించగా, ఐపీసీ సెక్షన్ 341, 384, 506 కింద కేసు నమోదు చేసినట్టు ఇబ్రహీంపట్నం సీఐ పవన్ కిషోర్ వెల్లడించారు. వారు సంతకాలు చేసిన ఖాళీ బాండ్ పేపర్లను స్వాధీనం చేసుకున్నామని, నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.