మళ్లీ కోర్టుకు జియో... ఎయిర్ టెల్ పై 'ఐపీఎల్' వార్!
- 'సీజన్ పాస్' అంటూ ఎయిర్ టెల్ యాడ్
- కస్టమర్లను తప్పుదారి పట్టిస్తోందంటున్న జియో
- గతంలోనే విచారించి తీర్పిచ్చిన ఢిల్లీ హైకోర్టు
- అమలు చేయలేదంటూ మళ్లీ కోర్టుకు జియో
దీనిపై గతంలో విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు, ప్రింట్ మీడియా ప్రకటనల్లో కనీసం 12 పిక్సెల్ పరిమాణంలో అక్షరాలుండాలని తీర్పిచ్చింది. వీడియో ప్రకటనలపైనా మార్గదర్శకాలు సూచించింది. హైకోర్టు ఆదేశాలను ఎయిర్ టెల్ ఖాతరు చేయడం లేదని ఆరోపిస్తూ, జియో సుప్రీంకోర్టులో తాజాగా స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేసింది. అందరికీ కనిపించేలా పెద్ద అక్షరాల్లో నిబంధనలను ఉంచాలని రిజలయన్స్ జియో వాదిస్తుండగా, తాము హైకోర్టు ఆదేశాలను పాటిస్తున్నామని ఎయిర్ టెల్ చెబుతోంది.