ఫైనల్ నీదా? నాదా?.. సై అంటున్న హైదరాబాద్, చెన్నై జట్లు
- నేడు క్వాలిఫయర్ పోరు
- బౌలర్లే అండగా రెచ్చిపోనున్న సన్ రైజర్స్ హైదరాబాద్
- ఆల్ రౌండ్ ప్రతిభతో చెన్నై సూపర్ కింగ్స్
ఇక ఈ సీజన్ లో మంచి బ్యాటింగ్ లైనప్, ఆల్ రౌండర్లతో బలంగా కనిపిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, తక్కువ స్కోరు చేసినా కూడా దాన్ని కాపాడుకునే సత్తా ఉన్న బౌలర్లను కలిగివున్న హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్ లో హోరాహోరీ తలపడేందుకు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని అంబటి రాయుడిని సాధ్యమైనంత త్వరగా అడ్డుకోగలిగే పనిని భువనేశ్వర్, సందీప్ లకు హైదరాబాద్ జట్టు అప్పగించింది. ఈ మ్యాచ్ లో చెన్నై ఆటగాళ్లకు ఎంత తొందరగా హైదరాబాద్ బౌలర్లు కళ్లెం వేయగలరన్న విషయంపైనే హైదరాబాద్ జట్టు విజయం ఆధారపడి వుండగా, టాప్ ఆర్డర్ తో పాటు దిగువన వచ్చే ఆటగాళ్లు సైతం పరుగులు సాధిస్తుండటం చెన్నైకి కలిసొచ్చే అంశం.