కొండపై సెల్ఫీ.. సముద్రంలో పడిపోయి ప్రాణాలు కోల్పోయిన భారతీయ విద్యార్థి

  • పెర్త్ యూనివర్సిటీలో చదువుకుంటోన్న అంకిత్
  • 40 మీటర్ల ఎత్తయిన కొండపై సెల్ఫీకి ప్రయత్నం
  • ఒక్కసారిగా పడిపోయిన వైనం
సెల్ఫీల పిచ్చికి మరో యువకుడు బలయ్యాడు. ప్రమాదకర ప్రదేశంలో సెల్ఫీ తీసుకోవాలని సరదాపడిన అంకిత్ (20) అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్ యూనివర్సిటీలో చదువుకుంటోన్న భారతీయ విద్యార్థి అంకిత్‌ తన ఫ్రెండ్స్‌తో కలిసి అల్బనీ టౌన్ దగ్గర్లో ఉన్న 40 మీటర్ల ఎత్తయిన కొండపైకి వెళ్లాడు.

సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ఒక్కసారిగా కాలు జారి సముద్రంలో పడిపోయాడు. అతడి కోసం గాలించిన పోలీసులు గంట తరువాత మృతదేహాన్ని వెలికితీశారు. చాలా ప్రమాదకర ప్రాంతంలో ఆయన సెల్ఫీ తీసుకున్నాడని పోలీసులు అన్నారు. ఈ విషయాన్ని అంకిత్ తల్లిదండ్రులకు తెలిపేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.   
Go Back to Shorts
selfie
India
Australia

More Telugu News