రూ.1.35 లక్షల ఖరీదైన చెప్పులు ధరించిన ప్రియాంక చోప్రా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రూ.1.35 లక్షల ఖరీదైన చెప్పులు ధరించిన ప్రియాంక చోప్రా

  • బ్రిటన్‌ రాకుమారుడు హ్యారీ పెళ్లికి ప్రియాంక
  • స్వరోక్సి క్రిస్టల్స్‌తో ప్రియాంక చోప్రా చెప్పులు ప్రత్యేకంగా డిజైన్‌
  • అమెరికా నటి మేఘన్‌తో బ్రిటన్‌ రాకుమారుడి వివాహం
  • ప్రియాంకకు మేఘన్ మంచి స్నేహితురాలు
మొన్న జరిగిన బ్రిటన్‌ రాకుమారుడు హ్యారీ, అమెరికా నటి మేఘన్‌ మార్కల్‌ల పెళ్లి వేడుకకు సినీ నటి ప్రియాంక చోప్రా రూ.1.35 లక్షల విలువ చేసే చెప్పులు వేసుకెళ్లి వార్తల్లో నిలిచింది. తలపై నుంచి పాదాల వరకు ఆమె చేసుకున్న అలంకారాలు అద్భుతమని ఆమె అభిమానులు అంటున్నారు. ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

స్వరోక్సి క్రిస్టల్స్‌తో ప్రియాంక చోప్రా తన చెప్పులను ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకుంది. అమెరికా నటి మేఘన్‌.. ప్రియాంక చోప్రాకు మంచి స్నేహితురాలు. తన స్నేహితురాలి జీవితం ఈ పెళ్లితో మారిపోతుందని, ఆమె చాలా తెలివైన నటి అని ప్రియాంక చోప్రా పేర్కొంది. కాగా, ఈ పెళ్లి వేడుకకు ఎందరో అతిరథ మహారథులు వచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా టీవీల్లోనూ ఈ వివాహ వేడుక ప్రసారమైంది.       
prianka
america
marriage

More Telugu News