ముంబై ఓడిపోవడంతో ఆనందంగా ఉందన్న ప్రీతిజింటా... వివాదాస్పదమైన వీడియో చూడండి!
- నిన్న ఢిల్లీ చేతిలో ఓడిపోయిన ముంబై
- ఆ వెంటనే ఆనందాన్ని పంచుకున్న పంజాబ్ యజమాని ప్రీతి జింటా
- ట్రాల్ చేస్తున్న నెటిజన్లు
ప్రీతి తన పక్కనున్న వ్యక్తితో, తానిప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని చెప్పడం, నవ్వుతుండటం చూసిన ముంబై అభిమానులు, ఇప్పుడామెను ట్రాల్ చేస్తూ ఘోరమైన కామెంట్స్ పెడుతున్నారు. ఆపై జరిగిన చెన్నై, కోల్ కతా మ్యాచ్ లో కనీసం 53 పరుగుల తేడాతో చెన్నైని ఓడిస్తే, పంజాబ్ జట్టుకు ప్లే ఆఫ్ గ్రూప్ లో ప్లేస్ దక్కనుండగా, ఆ మ్యాచ్ లో పంజాబ్ జట్టు ఓడిపోయిన సంగతి తెలిసిందే. ప్రీతి అత్యాశ ఆ జట్టు కొంపముంచిందని కూడా నెటిజన్లు ఇప్పుడు కామెంట్స్ పెడుతున్నారు. ప్రీతి వ్యాఖ్యల వీడియోను మీరూ చూడండి.