నేడు ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు
- ఏపీకి ప్రత్యేకహోదా ఎన్నికల గారడీలతో రాదు
- చంద్రబాబు గారడీలు విశేష ఆకర్షణగా మారాయి
- మావోయిస్టు పార్టీ ఏవోబీ ఎస్ జడ్సీ అధికార ప్రతినిధి జగబందు
‘హోదా’ డిమాండ్ నేపథ్యంలో చంద్రబాబు గారడీలు విశేష ఆకర్షణగా మారాయని ఆ లేఖలో విమర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ, టీడీపీ లు ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. ప్రత్యేకహోదా సాధించిన రాష్ట్రాలపై దృష్టి సారిస్తే ఆయా రాష్ట్రాల్లో ఏ మేరకు అభివృద్ధి జరిగిందో అర్థమవుతుందని సూచించారు. కాగా, బంద్ నేపథ్యంలో ఏవోబీలో గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. విశాఖ ఏజెన్సీలోని మారుమూల గ్రామాలకు రాత్రి వేళల్లో ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు.