కర్ణాటక గవర్నర్‌పై కాంగ్రెస్‌ నేత అనుచిత వ్యాఖ్య

  • ప్రతి ఒక్కరూ తమ కుక్కలకు వాజుభాయ్‌ పేరు పెట్టుకోవాలి
  • ఆయన కంటే విశ్వాసం ప్రదర్శించేవారు ఎవరూ ఉండరు
  • గవర్నర్ బీజేపీకి విధేయుడై ఉన్నారు
కర్ణాటక అసెంబ్లీలో ఈ రోజు బీజేపీకి ఎదురైన అనుభవంపై మహారాష్ట్రలోనూ కాంగ్రెస్‌ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సంజయ్ నిరూపమ్ తాజాగా మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్ర ప్రథమ పౌరుడు, గవర్నర్ వాజుభాయి వాలాపై అనుచిత వ్యాఖ్య చేశారు. వాజుభాయి వాలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని ప్రయత్నించారని, మెజారిటీ ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అకాశం ఇవ్వలేదని అన్నారు.

అంతేగాక, ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకి చెందిన వ్యక్తిని నియమించారని, అసలైన విధేయత అనే పదానికి గవర్నర్ వజూభాయ్ వాలా ఓ అర్థంలా మారారని అన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ తమ కుక్కలకు వాజుభాయ్‌ వాలా అని పేరు పెట్టుకోవాలేమో అని, ఆయన కంటే విశ్వాసం, విధేయతలను ప్రదర్శించేవారు ఎవ్వరూ ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Karnataka
Congress
BJP

More Telugu News