డైరెక్ట్ గా బేరసారాలు జరిపిన యడ్యూరప్ప.. ఎమ్మెల్యేతో యడ్డీ జరిపిన సంభాషణ ఇదే..!
- కాంగ్రెస్ ఎమ్మెల్యే బీసీ పాటిల్ కు యడ్డీ ఆఫర్
- మంత్రి పదవి, కావాల్సినంత సాయం
- ఇంకా కావాలంటే శ్రీరాములుతో మాట్లాడతా
యడ్యూరప్ప: ఎక్కడున్నారు?
పాటిల్: బస్సులో ఉన్నాం. కొచ్చికి వెళుతున్నాం.
యడ్యూరప్ప: కొచ్చికి వెళ్లకు. వెనక్కి వచ్చేయ్.
పాటిల్: నా పొజిషన్ ఏమిటో ముందు చెప్పండి.
యడ్యూరప్ప: యూ విల్ బికమ్ మినిస్టర్. కావాల్సినంత సాయం కూడా చేస్తాం.
పాటిల్: నాతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
యడ్యూరప్ప: వాళ్లను కూడా పిలుచుకుని రా. ఇంకా ఏమైనా కావాలంటే శ్రీరాములుతో మాట్లాడతా.
పాటిల్: అలాగే అన్నా.
యడ్యూరప్ప: ఏం చేయాలనుకుంటున్నావు?
పాటిల్: మీరు చెప్పినట్టే చేద్దాం. ఐదు నిమిషాల్లో మళ్లీ ఫోన్ చేస్తా.