అమెరికా స్కూల్లో తుపాకీ మోత.. 10 మంది మృతి
- ఆయుధాలతో తరగతి గదిలోకి ప్రవేశించిన విద్యార్థి
- విచక్షణ రహితంగా కాల్పులు
- నిందితుడి నుంచి మారణాయుధాలు స్వాధీనం
ప్రధాన నిందితుడితోపాటు మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రైఫిల్, పిస్టల్, షాట్‌గన్, పైప్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాదిలో ఇది 22వ కాల్పుల ఘటన కాగా, గత వారం రోజుల్లో మూడోదని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. కాల్పులకు గల కారణాలను ఆరా తీస్తున్నట్టు చెప్పారు. విషయం తెలిసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.