ఒక్క ఓటు తక్కువ కావడంతో పీఎం పదవినే వదిలేశారు.. ఇప్పుడు ఆ పార్టీ ఎంతకైనా దిగజారుతోంది: సీపీఐ నారాయణ
- వాజపేయి హయాంలో బీజేపీ నీతివంతంగా ఉండేది
- మోదీ నాయకత్వంలో అధికారం కోసం ఎంతకైనా దిగజారుతోంది
- కర్ణాటకలో గవర్నర్ ను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు
ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు వంటిదని అన్నారు. వాజపేయి హయాంలో బీజేపీ నీతివంతమైన రాజకీయాలు చేసిందని... కేవలం ఒక్క ఓటు తక్కువైన నేపథ్యంలో ప్రధాని పదవినే వాజపేయి వదిలేశారని చెప్పారు. ఇప్పుడు మోదీ నాయకత్వంలో అధికారమే పరమావధిగా బీజేపీ సాగుతోందని... అధికారం కోసం ఎంతకైనా దిగజారుతోందని విమర్శించారు. కేరళలో ఒక్క సీటు తక్కువ కావడంతో ప్రతిపక్షంలో కూర్చున్న గొప్ప చరిత్ర సీపీఐది అని చెప్పారు.