యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి మోదీ, అమిత్ గైర్హాజరు!
- మరికాసేపట్లో కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం
- పూర్తి మెజారిటీ లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న బీజేపీ
- కొందరు కేంద్ర మంత్రులు మాత్రమే హాజరు
ఇదే సమయంలో కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, జేపీ నడ్డా, సదానంద గౌడ తదితరులు ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. కాగా, తాను 17వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని యడ్యూరప్ప నాలుగు రోజుల క్రితమే వెల్లడించిన సంగతి తెలిసిందే. 15న తన గెలుపు ఖాయమని, అదే రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లి ప్రధానిని, తమ పార్టీ అధ్యక్షుడిని కలిసి వారిని ఆహ్వానిస్తానని వెల్లడించిన యడ్యూరప్ప, ప్రస్తుత పరిస్థితుల్లో వారితో ఫోన్ లో మాట్లాడారే తప్ప వెళ్లలేకపోయారన్న సంగతి తెలిసిందే.