పాతగుంటూరు అత్యాచారం ఘటన.. చంద్రబాబు సీరియస్!

  • ఆడబిడ్డలకు అన్యాయం చేస్తే కఠిన చర్యలు తప్పవు
  • నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం
  • బాధితురాలని, ఆమె కుటుంబాన్ని ఆదుకుంటాం
పాత గుంటూరులో బాలికపై యువకుడు అత్యాచారానికి యత్నించిన ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆడబిడ్డలకు అన్యాయం చేస్తే కఠిన చర్యలు తప్పవని, బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

కాగా, బాలికపై అత్యాచారానికి యత్నించిన నిందితుడిని పోలీసులు రిమాండ్ కు తరలించారు. పాతగుంటూరులో గత అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. నిందితుడిని తమకు అప్పగించాలంటూ పోలీస్ స్టేషన్ పై బాధితురాలి కుటుంబీకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 22 మంది పోలీసులకు గాయాలయ్యాయని, పోలీస్ వాహనాలు ధ్వంసమైనట్టు చెప్పారు. పోలీసులపై దాడికి పాల్పడ్డ వారిపై కేసులు నమోదు చేశారు. నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.  
Go Back to Shorts
guntur
molestation attempt

More Telugu News