కర్ణాటకలో త్రిపుర తరహా రాజకీయాన్ని బీజేపీ చేసింది: మంత్రి సోమిరెడ్డి
- కర్ణాటక ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు
- త్రిపుర తరహా రాజకీయం ఇక్కడా చేసింది
- ఈ ఎన్నికల్లో బీజేపీ రూ.10,500 కోట్లు ఖర్చు చేసింది
- అందుకే, అన్ని స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది!
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ రూ.10,500 కోట్లు ఖర్చు చేసినట్టు ఓ సర్వే తేల్చిందని అన్నారు. ఇంత మొత్తం ఖర్చు చేసింది కనుకే బీజేపీ అన్ని స్థానాల్లో విజయం సాధించిందని విమర్శించారు. అయితే, కాంగ్రెస్ కంటే బీజేపీకి తక్కువ శాతం ఓట్లు వచ్చాయని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఆటలు సాగవని సోమిరెడ్డి హెచ్చరించారు.