యూపీ సీఎం యోగికి తప్పిన ప్రమాదం... పొలాల్లో అర్థాంతరంగా హెలికాప్టర్ ల్యాండింగ్
- హెలిప్యాడ్ కిలోమీటరు దూరంలో ఉండగా హెలికాప్టర్లో సమస్య
- దీంతో అత్యవసరంగా దించేసిన పైలట్
- సీఎం సురక్షితమని ప్రకటించిన ప్రభుత్వం
అలాగే, అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ తో సమీక్ష కూడా నిర్వహించనున్నారు. సీఎం రాక నేపథ్యంలో ఫరౌలి గ్రామ సమీపంలోని కస్తూర్బా విద్యాలయంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అయితే, కిలోమీటరు దూరంలో ఉండగానేే హెలికాప్టర్ లో సమస్య ఏర్పడడంతో పైలట్ వెంటనే దాన్ని పొలాల్లో సురక్షితంగా దించేశారు. అనంతరం ముఖ్యమంత్రి యథావిధిగా షెడ్యూల్ ప్రకారం తన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లారు.