ఫలితం మారుతుందా?... మెజారిటీకి దూరం జరుగుతున్న బీజేపీ!
- ఓ దశలో 118 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న బీజేపీ
- ప్రస్తుతం 107 స్థానాలకు పరిమితం
- 73 స్థానాలకు పెరిగిన కాంగ్రెస్ ఆధిక్యం
ఇక ఇవే ఫలితాలు చివరి వరకూ కొనసాగితే, అధికారం పొందాలంటే కింగ్ మేకర్ గా మారిన జేడీఎస్ సహాయం తీసుకోవడం బీజేపీకి తప్పనిసరి. ఇదే సమయంలో గతంలో ఫిరాయింపుదారులను ప్రోత్సహించి, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమవైపు లాక్కుని గోవా, మణిపూర్ లో అధికారానికి దగ్గరైనట్టే, కర్ణాటకలోనూ ఓ ఐదారుగురు ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.