ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ!

  • 118 చోట్ల ఆధిక్యంలో బీజేపీ
  • మ్యాజిక్ ఫిగర్ కన్నా ఆరు స్థానాలు అధికం
  • సొంతంగానే ప్రభుత్వ ఏర్పాటు!
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీని సాధించే దిశగా పరుగులు పెడుతోంది. 222 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగగా, బీజేపీ ప్రస్తుతం ఒకచోట విజయం సాధించి, 118 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న స్థానాల సంఖ్య 65 నుంచి 57కు పడిపోగా, జేడీఎస్ 44 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఈ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 112 కాగా, బీజేపీ సునాయాసంగా ఆ మార్కును అధిగమించేలా కనిపిస్తుండగా, జేడీఎస్ తో ఎటువంటి పొత్తూ లేకుండానే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు యడ్యూరప్ప సిద్ధమవుతున్నారు. తాను 15వ తేదీ సాయంత్రం ఢిల్లీకి వెళ్లి, ఆపై 17వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నానని మూడు రోజుల క్రితం యడ్యూరప్ప ప్రకటించిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
BJP
Congress
Karnataka
Elections

More Telugu News