మరొక్కరోజు వేచి చూస్తే అంతా తెలిసిపోతుంది: సిద్ధరామయ్య

  • ఐదేళ్ల క్రితం ఇదే రోజున సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాను
  • చాలా నేర్చుకున్నాను
  • తగినంత రాజకీయ పరిజ్ఞానం సంపాదించుకున్నాను
  • కర్ణాటక ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది
తాను ఐదేళ్ల క్రితం ఇదే రోజున ( మే 13, 2013) కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానని సిద్ధరామయ్య అన్నారు. ఆ కాలంలో తాను చాలా నేర్చుకున్నానని, తగినంత రాజకీయ పరిజ్ఞానం సంపాదించుకున్నానని చెప్పారు. తాను చేయగలిగినంత మేరకు కర్ణాటకలో మంచి పనులు చేశానని, పదవి చేపట్టాక తాను ఏమేం చేయాలని గత ఎన్నికల ముందు అనుకున్నానో ఆ పనులన్నీ దాదాపు చేశానని తెలిపారు.

తాను కర్ణాటక ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చాననే అనుకుంటున్నానని, ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైందని, ఇకపై కూడా ప్రజలు తనపై ఇదే నమ్మకాన్ని ఉంచుతారని భావిస్తున్నానని సిద్ధరామయ్య అన్నారు. అయితే, రాష్ట్రాభివృద్ధి పట్ల తాను సంతృప్తిగా లేనని, కర్ణాటక ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందని, ఆ దిశగా పనిచేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నానని తెలిపారు. మరొక్కరోజు వేచి చూస్తే అంతా తెలిసిపోతుందని అన్నారు. కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్న విషయం తెలిసిందే. 
Go Back to Shorts
sidda ramaiah
Karnataka
Congress

More Telugu News