మతకలహాల్లో స్వయంగా పాల్గొని విధ్వంసం సృష్టించిన 10 మంది పోలీసులు... ఔరంగాబాద్ లో సంచలనం సృష్టిస్తున్న వీడియో!
- 9 నిమిషాల నిడివి ఉన్న వీడియో క్లిప్
- నిరసనకారులతో కలసిపోయిన 10 మంది పోలీసులు
- పోలీసు వ్యవస్థపై మాయని మచ్చ
- కఠిన చర్యలుంటాయన్న ఉన్నతాధికారులు
శనివారం తెల్లవారుజామున ఓ భవంతి కిటికీ నుంచి ఈ వీడియోను తీసినట్టు ఉండగా, పోలీసుల వైఖరిపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు పోలీసులకు కూడా లేదని, ఈ వీడియోలో కనిపిస్తూ, విధ్వంసాలకు దగ్గరుండి మద్దతిచ్చిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలుంటాయని అదనపు డీజీపీ బిపిన్ బిహారీ పేర్కొన్నారు.
ఈ ఘటన పోలీసు వ్యవస్థకే మాయనిమచ్చని ఔరంగాబాద్ పోలీస్ చీఫ్ మిలింద్ భరాంబే వ్యాఖ్యానించారు. ఇది తీవ్రమైన తప్పిదమని, విచారణ ప్రారంభించామని అన్నారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలోకి ఎక్కకుండా చూడాలని అన్ని సామాజిక మాధ్యమ సంస్థలకూ అధికారులు ఆదేశాలు పంపారు. నగరంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయించారు.