ఎగ్జిట్ పోల్స్ వినోదం కోసమే... వాటిని చూసి ఆందోళన చెందకండి: సిద్ధరామయ్య
- సగటు గణాంకాలపై ఆధారపడే పోల్స్ అవి
- విజయంపై ధీమా
- ఈ మేరకు ట్విట్టర్లో పోస్టింగ్
‘‘ఎగ్జిట్ పోల్స్ రెండు రోజుల పాటు వినోదం పంచేవి. ఒక నది సగటున 4 అడుగుల లోతు ఉందంటూ ఓ గణాంకకుడు చెప్పిన వివరాల ఆధారంగా ఓ వ్యక్తి ఆ నదిలో నడుచుకుంటూ వెళ్లడం అసాధ్యం. ఎగ్జిట్ పోల్స్ సైతం ఈ తరహా గణాంకాలపైనే ఆధారపడతాయి. కనుక ప్రియమైన పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, శ్రేయోభిలాషులు ఎగ్జిట్ పోల్స్ గురించి ఆందోళన చెందకండి’’ అంటూ సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. విజయంపై ధీమాను వ్యక్తం చేశారు.